Thursday, July 16, 2015

గాయకుడు రామకృష్ణ


కాలం గడియారం ముల్లులా నిదానంగా, నిరంతరంగా తన పని తను చేసుకుపోతుంటుంది. పుట్టేవాళ్ళు పుడుతుంటే పొయ్యేవాళ్ళు పోతుంటారు. ఎవరు ఎంత గొప్పవాళ్ళైనా, అసలు గొప్పవాళ్ళే కాకపోయినా కాలమహిమకి తలొంచక తప్పదు. మన రాజకీయ నాయకులకి లేకపోయినా కాలానికి మాత్రం గొప్ప డెమోక్రటిక్ స్పిరిట్ వుందని భావిస్తున్నాను.

గాయకుడు రామకృష్ణ మరణించాడు. ఆయన సినిమాల్లో పాడి చాలా కాలమే అయింది. సినిమా రంగం విచిత్రమైంది. ఇక్కడ ఎవరు ఎందుకు ఎంతకాలం సక్సస్‌ఫుల్‌గా వుంటారో తెలీదు. రామకృష్ణ కెరీర్ మొదలవడం మాత్రం చాలా ప్రామిసింగ్‌గా మొదలైంది. అందుకు ఆయనకి సమయం కూడా అనుకూలించింది. ఘంటసాల తన అనారోగ్యం వల్ల పాటలు తగ్గించుకున్న సమయంలో సినిమావాళ్ళకి అచ్చు ఘంటసాలని అనుకరించే రామకృష్ణ మంచి ప్రత్యామ్నాయంగా కనిపించాడు. 

ఆనాడు సినిమాల్లో రామారావు, నాగేశ్వరరావులది అగ్రస్థానం. కృష్ణ, శోభన్‌బాబులది తరవాత స్థానం. ఎప్పుడైనా అగ్రనటులకి పని చేసినవారిదే టాప్ బిల్లింగ్. అలా రామకృష్ణ సినిమా రంగం ఎంట్రీనే టాప్ గేర్‌లో మొదలైంది. మరి ఆ తరవాత ఏం జరిగిందో తెలీదు గానీ.. వెనకపడ్డాడు, బాగా వెనకపడ్డాడు. ఆ తరవాత కొన్నాళ్ళకి కచేరీల్లో మాత్రమే పాడాడు. సినిమాల్లో కెరీర్ అప్ అండ్ డౌన్‌లు సహజం. కానీ రామకృష్ణ మాత్రం మళ్ళీ కోలుకోలేకపొయ్యాడు. 

ఎప్పుడైనా ఒక అగ్రస్థాయి గాయకుడిని మక్కికిమక్కిగా అనుకరిస్తూ లాంగ్ కెరీర్ నిర్మించుకోవడం కష్టం, అసాధ్యమేమో కూడా. ఈ విషయం రఫీ, ముకేశ్, కిశోర్‌లని అనుకరిస్తూ తొందరగా లైంలైట్‌లోకి వచ్చినా.. అర్జంటుగా ఫేడౌట్ అయిన అనుకరణ గాయకులని గమనిస్తే అర్ధమవుతుంది. 

సరే! రామకృష్ణ గొప్ప గాయకుడా? అయితే ఎంత గొప్ప గాయకుడు? లాంటి ప్రశ్నలకి ఇక్కడ సమాధానం వుండదు. ఎందుకంటే ఇక్కడ నేన్రాస్తుంది గాయకుడు రామకృష్ణ గూర్చి నా ఆలోచనలు, జ్ఞాపకాలు మాత్రమే కాబట్టి.

రామకృష్ణా! మీరు మంచి గాయకులు. మీరు పాడిన పాటలు విని నేను ఆనందించాను. అందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రస్తుతానికి గురువు ఘంటసాల గారితో కబుర్లు చెప్పుకోండి. నేనక్కడికి వచ్చినప్పుడు మీ గాయకులందర్నీ ఒకచేట చేర్చి పసందైన జుగల్‌బందీ ఎరేంజ్ చేస్తాన్లే!

గమనిక -

ఇక్కడ కామెంట్ డబ్బా వుంది. నాకు నచ్చిన కామెంట్లు మాత్రమే పబ్లిష్ చేస్తాను. 

(picture courtesy : Google)

6 comments:

  1. మొదటి సారి విన్నది బహుశా భక్త తుకారాంలో అనుకుంటాను. ఆ సినిమాలో అతని పాటలు ఘంతసాల పాటలంత హిట్ కాకపోయినా, బాగా పాడాడు అనిపించాయి. తరువాత పాడిన చాలా పాటల్లో ఘంటసాల అనుకరణ కంటే అతని స్వంత శైలి ఒకటి ఏర్పడ్డం మనకి వినిపిస్తుంది. తరవాత అవకాశాలు రాకపోవడం, కనుమరుగవ్వడం విచార కరం.

    ReplyDelete
  2. మానాన్నగారితో రామకృష్ణ గారిగురించి సంభాషణ వచ్చినప్పుడు మొదట్లో బాగానే పాడినా తరువత తరువాత ముక్కుతో పాడేవాడు అందుకె అందరూ పక్కన పెట్టేశారు అంటారు.

    ReplyDelete

  3. రామ కృష్ణ గారి కి నివాళి.

    టపాలకి కామింటు కావి కట్టేశారు ; ఇక మిగిలింది అగ్రిగేటర్ అంగవస్త్రం మాత్రమె ! అదీ కానిచ్చీరంటే ఇక ఫుల్ ఫార్మ్ లోకి వచ్చేసి నట్టే మీరు తెలుగు బాలాగు లోకం లోకి మళ్ళీ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి జీ,

      మీ అభిమానానికి ధన్యవాదాలు. ఎగ్రిగేటర్ల వాతావరణం దారుణంగా, హీనంగా, కంపరంగా, రోతగా వుంది. ఆ చిచ్చర పిడుగుల్ని భరించడం నా వల్లకాదు. నీచుల్తో సంభాషించి నా స్థాయి తగ్గించుకోలేను. ఎగ్రిగేటర్ల రొచ్చులోంచి బయట పడాలనే ఈ 'పిపీలికం' బ్లాగ్ మొదలెట్టాను. కావున మళ్ళీ అటువైపు వొచ్చే అవకాశం లేదు.

      నా పోస్ట్ షేర్ చేసినందుకు కృతజ్ఞతలు. కానీ - ప్రస్తుతం ఎగ్రిగేటర్లలో దారుణంగా మొరుగుతున్న కుక్కల బారి నుండి నన్ను కాపాడాల్సిన బాధ్యత కూడా మీదే అవుతుంది. గ్రహించగలరు.

      Delete

  4. ఏమండీ డాటేరు బాబు గారు ,

    మళ్ళీ దుకాణం బంద్ చేసి నట్టు న్నారు :) దేశం లో మీ టపా లకి సరి జోదు మేటర్లు , సరి 'కొట్ట' ఈవెంట్సు చాలా వచ్చేస్తున్నాయి - లేటెస్ట్ ల్యాండ్ బిల్ బ్యాక్ అవుట్ తో సహా :) మీరేమో టపాలు 'బంధించేసేరు' ?

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Zilebi ji,
      దాదాపు బంద్ అనే అనుకుంటున్నాను. ఇప్పుడు బ్లాగ్ రాసేంత ఓపికా, ఆసక్తీ లేవు. I still wonder how i managed to write so many posts in my previous blog. I give some credit to you for helping to write so regularly. Thank you!

      Delete

Comments will be moderated, may take sometime to appear.