అవి మేం చదూకునే రోజులు. మాకు సినిమాలే ప్రధాన కాలక్షేపం. సినిమా బాగుంటుందా లేదా అనేది ఎవడికీ పట్టేది కాదు, సినిమా చూడ్డమే ముఖ్యం. అవ్విధముగా - ప్రవాహంలో బెండుముక్క కొట్టుకుపోయినట్లు స్నేహితుల్తో అనేక సినిమా చూశాను. అప్పుడప్పుడు ఆ రోజులు గుర్తొచ్చి నవ్వుకుంటాను, ఆశ్చర్యపోతాను.
ఒకరోజు 'స్వాతిముత్యం' అనే సినిమాకి వెళ్లాం. హీరో వెర్రిబాగులోడు (పాపం). అతన్ని పెంచి పెద్దచేసిన ముసలామె చచ్చిపోయి అందరూ ఏడుస్తుంటే - ఆకలేస్తుందని అడిగి మరీ అన్నం పెట్టించుకుని తింటాడు. అతగాడు mentally retarded కదా? కాబట్టి అతనలా అన్నం తినడం దర్శకత్వ ప్రతిభే.
హీరోయిన్ వెధవరాలు. భర్త పోయిన పుట్టెడు దుఃఖంతో (వితంతువులు ఎల్లప్పుడూ దుఃఖిస్తూనే వుండాలని మన సినీమేధావులు భానుమతి 'బాటసారి' రోజుల్నుండే నిర్ణయించేశారు, మనమూ అలవాటు పడిపోయ్యాం), ఒక ఎల్కేజీ వయసు పిల్లాడితో బ్రతుకు వెళ్లమారుస్తూ వుంటుంది (మళ్ళీ ఇంకోసారి 'పాపం').
రాముడి గుళ్ళో యేదో కార్యాక్రమం జరుగుతుంటే - మన బుర్ర తక్కువ హీరో హడావుడిగా ఆ దుఃఖపు వితంతువుకి తాళి కట్టేస్తాడు. వాస్తవానికి ఒక స్త్రీకి ఎవడో అపరిచితుడు హఠాత్తుగా తాళి కట్టేస్తే నాలుగు బాది పోలీసు రిపోర్టు ఇస్తుంది. కానీ ఇది తెలుగు సినిమా! పైగా - ఆ స్త్రీ ఒక దుఃఖవితంతువాయె! దర్శకుడు హీరోగారిది ఆదర్శంగా highlight చేస్తాడు! హీరోయిన్ కూడా యే వెర్రిబాగులోడైతేనేం తాళి కట్టాడు, అంతే చాలన్నట్లుగా వుంటుంది.
సరే! తెలుగు సినిమా రాజకీయ నాయకుల ప్రజాసేవలాగా అర్ధం పర్ధం లేకుండా వుంటుంది. కావున - సినిమా చూస్తూ కూర్చున్నాను (అంతకన్నా చేసేదేమీ లేదు). ప్రేక్షకుల అదృష్టం బాగుండి హీరోయిన్ చచ్చిపోతుంది. అప్పుడు మన అజ్ఞాన హీరో చాలా సెంటిమెంటల్‌గా అయిపోతాడు (ఇప్పుడు మాత్రం అన్నం తినడు)!
సినిమా ఫస్టాఫ్‌లో ముసలామె చచ్చిపోయినప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు! అవును, అలనాడు 'అర్ధాంగి'లో సావిత్రి కూడా తన ప్రేమతో నాగేశ్వర్రావు IQ score పెంచింది. ఈ రోజుల్లో మగవాడికి పెళ్ళైతే వున్న తెలివి తెల్లారిపోతుంది గానీ - ఆ రోజుల్లో వేరుగా వుండేది. అది భర్తల స్వర్ణయుగం. అందుకే - 'పెళ్ళైతే పిచ్చి కుదుర్తుంది' అనే సామెత వచ్చింది.
సినిమా అయిపోంగాన్లే హాలు పక్కనే వున్న హోటల్లో రవ్వట్టు తిన్నాం, బాగుంది.
"సినిమా ఎలా వుంది?" కాఫీ తాగుతూ అడిగాను.
నా స్నేహితులు అనేక సినిమాలు చూసిన విజ్ఞులు. అంచేత నా ప్రశ్నకి ముక్తకంఠంతో సమాధానం చెప్పారు.
"సినిమా ఎలా వుంటే మాత్రం మనకెందుకు? తీసేవాళ్ళు తీస్తారు, చూసేవాళ్ళు చూస్తారు. వాళ్ళేమన్నా మనకి బొట్టూ కాటుక పెట్టి 'మా సినిమా చూడగా రారండీ!' అని పిల్చారా? లేదు కదా? మనకి పనీపాటా లేక సినిమాకొస్తాం. నచ్చితే కళ్ళు తెరుచుకుని సినిమా చూస్తాం, నచ్చకపోతే కళ్ళు మూసుకుని ఓ కునుకు తీస్తాం. అంతే!"
అవును, అంతే!
(picture courtesy : Google)
ReplyDeleteఆహా ! ఏమి ఈ శుభదినము ! పని లేని రమణ గారికి ఇవ్వాళ ముహూర్తము కుదిరింది మరో టపా వ్రాయటానికి ! ఇంతకీ హీరోయిన్ వెధవ నా విధవ నా ! జేకే !
బాగున్నారా ?
జిలేబి
జిలేబిజీ,
Deleteమీ పలకరింపుకి ధన్యవాదాలు. నా 'పిపీలికం'ని 'వరూధిని'లో చేర్చినందుకు మరొక్కసారి ధన్యవాదాలు.
నేను బాగానే వున్నాను. పేషంట్లు, పుస్తకాలు.. యేదో జీవితం అలా గడిచిపోతుంది.
hello doctor garu,
ReplyDeletei'm a big fan of you.
i have read your posts continuously from morning 10:30 am to 6:30 pm(without break) when i first saw your blog.
i like your posts about brodipet, your father and mother, your childhood memories, movies etc........
i cant list them out, but i like almost all your posts.
Keep blogging:)
Thank you.
DeleteEarlier i used to write posts almost on regular basis. It was mainly due to the encouragement given my fellow bloggers. We also had some healthy discussions on several issues.
Of late things changed drastically and the environment had become hostile and irritating. One blogger constantly harassed and heckled me. So i was forced to get out of blogging.
ఎచ్చాడో పిచ్చాడో .. ఏదో ఒక గొడుగు నీడుంటే చాలన్నట్టు ... ఆ వితంతువుకి ఆ అమాయక చక్రవర్తిచేత తాళి కట్టించడం నాకు నచ్చలేదు . ఏదో ఒక కథలో ఉదహరించాను కూడా ! ఇలాంటి భావజాలాలతో వచ్చిన సినిమాలు కోకొల్లలు. బాగా వ్రాసారు రమణ గారు .
ReplyDeleteఇక జిలేబీ గారి ప్రశ్న కి జవాబు ... అమాయకపు వెధవకి దొరికిన దేవత .. అని సినిమాని మెచ్చిన జనావళి అభిప్రాయం అని నా గట్టి నమ్మకం.
ఇది భావజాలానికి సంబంధించిన విషయం. మనిద్దరికీ నచ్చని విషయం విశ్వనాథ్ target audience కి అద్భుతంగా అనిపించింది! :)
Deleteబ్లాగులొదిలేసి సుఖపడ్డారనుకున్నా! ఈ దురద వదిలేది కాదేమో సుమా!! కుశలవార్త చెప్పినందుకు సంతసం.
ReplyDeleteథాంక్యూ! నిన్న ఆదివారం, బోర్ కొట్టి నాలుగు ముక్కలు కెలికాలేండి. :)
Deletewith same theme, a pucca crime story can be built up- changing flavours here and there! If a moron in our village is lured by a widow and he, in turn, marries a mack- what would would you comment? what fate he would meet? If the same canal bath song is shot by KSR Das, ---------?
ReplyDeletei appreciate your creative talent! :)
DeleteGood to see your posts again...
ReplyDeleteనాకు తోచిన జవాబు, అందరూ ఏకీభవించవలసిన అవసరం లేదు కాని.
ReplyDeleteమీరు తీసిన పాయింట్లు బాగానే ఉన్నాయి కాని, కథకుడు, దర్శకుడు ఎంత మేధావైనా, పాత్రలు అంత మేధావులుగా ఉండనవసరంలేదు. మామూలు మనుష్యులు మామూలుగా ఆలోచిస్తేనే సహజంగా ఉంటుంది.
"మన బుర్ర తక్కువ హీరో హడావుడిగా ఆ దుఃఖపు వితంతువుకి తాళి కట్టేస్తాడు."
అతను హడావిడిగా తాళి కట్టలేదు. ముసలామె చెప్పిన సలహా మేరకే చేసాడు. పైగా తెలిసే చేసానని కూడ చెప్తాడు.
"హీరోయిన్ కూడా యే వెర్రిబాగులోడైతేనేం తాళి కట్టాడు, అంతే చాలన్నట్లుగా వుంటుంది."
ఆమె దిక్కులేని స్థితిలో ఉంది. అత్త మామలు బయటకు గెంటేసారు. అన్న ఇంట వదిన ఆమెని ఎప్పుడు బయటకు గెంటెయ్యాలా అని చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆమెకు దొరికిన ఆధారాన్ని సంప్రదాయానికి వ్యతిరేఖమైనా ఒప్పుకుంటుంది.
ఇదో జ్ఞాపకం మాత్రమే! సినిమా గూర్చి నాకే ఆసక్తీ లేదు. యేదో సరదాగా రాసుకుంటూ పొయ్యాను.
Delete(మీకు సినిమా బాగా గుర్తున్నట్లుంది.)
good to see your blogs again, we miss them, keep on blogging.
ReplyDeletethank you, lost interest in blogging and trying hard to resurrect. :)
DeleteGood to see that you are allowing Anon comments :)
ReplyDeleteI think movies are fictional, at least in most of the cases. As you have already said, it is up to audience to decide whether to watch it or not.
I think it would be good to write about the things we like rather than the ones we don't like. Interesting thing is that the whole social media runs on what they don't like (hate campaign or the so called intolerance), very strange, isn't it? Just would like to hear opinion on this phenomena, as a doctor :)
thank you.
Deletei remember writing both. it depends upon the issue. when i strongly feel something, i try to put it on paper (keyboard).