ఈ ప్రపంచంలో మనుషుల్ని పోలిన మనుషులు వుంటారు. అంతకంటే ఎక్కువగా సినిమాల్ని పోలిన సినిమాలూ వుంటాయి. ఇది కేవలం కాకతాళీయం మాత్రమేనని సినీజీవులు అంటారు. కొందరు తెలివైనవాళ్ళు 'స్పూర్తి' పొందామని గడుసుగా చెప్పుకుంటారు. చాలాసార్లు ఈ స్పూర్తికీ, కాపీకీ మధ్యన విభజనరేఖ సూదిలో దారంలా కనపడీ కనపడనట్లు వుంటుంది.
1959 లో 'కంపల్షన్' అనే ఆంగ్ల సినిమా వచ్చింది. ముఖ్యపాత్రని ఆర్సన్ వెల్స్ పోషించాడు (ఈయన పేరు వినంగాన్లే చప్పున గుర్తొచ్చేది 'సిటిజెన్ కేన్'). కథ టూకీగా - అనగనగా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఒకే కాలేజిలో చదువుకుంటున్నారు, బాగా ధనవంతుల బిడ్డలు. సరదా కోసం ఏమైనా చేస్తారు, ఎంతకైనా తెగిస్తారు. థ్రిల్ కోసం - పోలీసులకి అంతుపట్టని విధంగా ఒక నేరం చేద్దామనుకుంటారు. 'పెర్ఫెక్ట్ మర్డర్' కోసం ఒక పిల్లాణ్ణి కిడ్నాప్ చేసి హత్య చేస్తారు. అన్నీ పెర్ఫెక్టుగానే చేస్తారు గానీ - ఒక ముఖ్యమైన ఆధారాన్ని హత్య జరిగిన ప్రదేశంలో వదిలేస్తారు. ఆ ఆధారంతోనే వారికి శిక్ష పడే సమయం వస్తుంది. అప్పుడు ఆర్సన్ వెల్స్ నటించిన న్యాయవాది పాత్ర కోర్టు రూములోకి ప్రవేశించి ముద్దాయిల తరఫున తీవ్రంగా వాదిస్తుంది. చివరాకరికి ముద్దాయిలకి పడాల్సిన ఉరిశిక్ష తప్పిపోతుంది!
ఈ కథ చదువుతుంటే మీకో ప్రముఖమైన తెలుగు సినిమా గుర్తుకు రావాలి. 1969 లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన 'సుడిగుండాలు' అనే సినిమా కథాంశం కూడా ఇదే. ఈ సినిమా కథ 'కంపల్షన్' సినిమాని ఇంతగా పోలి వుండటం 'యాదృచ్చికం' అనుకోవాలంటే కొంచెం ఇబ్బందే! ఆ సినిమా తీసిన వాళ్ళెవరూ ఇప్పుడు లేరు, వున్నా మనకి చెబుతారో లేదో తెలీదు. ఆంగ్ల సాహిత్యం చదువుకుని లేదా ఆంగ్ల చిత్రం చూసుకుని - ఆ స్పూర్తితో కథలు వండటం అనేది ఒక పురాతన విద్య.
ఏ సినిమాకైనా ప్రధాన కథాంశం ఫలానా అని ముందో ముక్క అనుకుంటారు. ఈ ముక్క చపాతీ ముద్దలాంటిది. అప్పడాల కర్రని ఒడుపుగా తిప్పుతూ ఆ ముద్దకే వెడల్పుగా, గుండ్రంగా చపాతీ షేపు తెప్పిస్తారు. అంటే ఒక సినిమా మంచిచెడ్డలు పిండిముద్దతో మొదలవుతాయి. అట్లాంటి ప్రధాన కథాంశాన్ని కాపీ కొట్టేసి మాది 'స్పూర్తి' మాత్రమే అంటారు సినిమావాళ్ళు. సరే! ఎవరి దృష్టికోణం వారిది!
ఏ సినిమాకైనా ప్రధాన కథాంశం ఫలానా అని ముందో ముక్క అనుకుంటారు. ఈ ముక్క చపాతీ ముద్దలాంటిది. అప్పడాల కర్రని ఒడుపుగా తిప్పుతూ ఆ ముద్దకే వెడల్పుగా, గుండ్రంగా చపాతీ షేపు తెప్పిస్తారు. అంటే ఒక సినిమా మంచిచెడ్డలు పిండిముద్దతో మొదలవుతాయి. అట్లాంటి ప్రధాన కథాంశాన్ని కాపీ కొట్టేసి మాది 'స్పూర్తి' మాత్రమే అంటారు సినిమావాళ్ళు. సరే! ఎవరి దృష్టికోణం వారిది!
'సుడిగుండాలు' సినిమా పెద్దగా ఆడకపోయినా, సినీప్రేమికుల్ని అలరించింది. ఒక గొప్ప సినిమాగా కీర్తి నొందింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కేంద్ర ప్రభుత్వ అవార్డునీ పొందింది. ఈ సినిమా తీసి బోల్డంత సొమ్ము నష్టపొయ్యామని దర్శక నిర్మాతలు పలుమార్లు వాపొయ్యారు. అయితే - ఈ సినిమా మాతృక గూర్చి ఎక్కడా (నాకు తెలిసినంత మటుకూ) ప్రస్తావన రాకపోవడం ఆశ్చర్యకరం. బహుశా ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేకపోవడం ఒక కారణం కావచ్చు!
'సుడిగుండాలు'ని నేను మా గుంటూరు లక్ష్మీ పిక్చర్ పేలెస్‌లో చూశాను. అప్పట్లో నేను - ఫైటింగు లేని సినిమా మిరపకాయ లేని బజ్జీ వంటిదనే నమ్మకంతో వుండేవాణ్ని. అంచేత సినిమా నాకు చప్పగా అనిపించింది. చివర్లో న్యాయవాది నాగేశ్వరరావు 'ఈ దేశం ఏమవుతుంది? ఏమవుతుంది?' అంటూ మనకి బరువైన ప్రశ్నలు వేస్తూ, అందుగ్గానూ ఆయన కూడా తీవ్రంగా ఆవేదన చెందుతూ కోర్ట్ రూంలోనే పడిపోతాడు. 'గంటలకొద్దీ వాదించినందున అలసిపొయ్యి కళ్ళు తిరిగి పడ్డాడా? లేక చనిపొయ్యాడా?' అన్నది నాకు అర్ధం కాలేదు. ఆయన అలా పడిపొయ్యి అనేక దశాబ్దాలు దాటినందున - ఇప్పుడు తెలుసుకుని చెయ్యగలిగిందీ ఏం లేనందున, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం!
(photos courtesy : Google)
'సుడిగుండాలు'ని నేను మా గుంటూరు లక్ష్మీ పిక్చర్ పేలెస్‌లో చూశాను. అప్పట్లో నేను - ఫైటింగు లేని సినిమా మిరపకాయ లేని బజ్జీ వంటిదనే నమ్మకంతో వుండేవాణ్ని. అంచేత సినిమా నాకు చప్పగా అనిపించింది. చివర్లో న్యాయవాది నాగేశ్వరరావు 'ఈ దేశం ఏమవుతుంది? ఏమవుతుంది?' అంటూ మనకి బరువైన ప్రశ్నలు వేస్తూ, అందుగ్గానూ ఆయన కూడా తీవ్రంగా ఆవేదన చెందుతూ కోర్ట్ రూంలోనే పడిపోతాడు. 'గంటలకొద్దీ వాదించినందున అలసిపొయ్యి కళ్ళు తిరిగి పడ్డాడా? లేక చనిపొయ్యాడా?' అన్నది నాకు అర్ధం కాలేదు. ఆయన అలా పడిపొయ్యి అనేక దశాబ్దాలు దాటినందున - ఇప్పుడు తెలుసుకుని చెయ్యగలిగిందీ ఏం లేనందున, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం!
(photos courtesy : Google)
"ఆ స్పూర్తితో కథలు వండటం అనేది ఒక పురాతన విద్య. ". మరీ చమత్కారం ఎక్కువయ్యిందండి!
ReplyDeleteనిజమా! ఈ సారి ఎక్కువవకుండా జాగ్రత్త పడతాలేండి! :)
Deleteఈ బ్లాగు టెంప్లేట్ కన్నా పాత బ్లాగు టెంప్లేట్ బాగుంది.నీట్ గా కూడా ఉంది.పేరు కూడా పిపీలికంతో పోలిస్తే పనిలేక బాగుంది. మీ బ్లాగ్ మీ ఇష్టం అనుకోండి.
ReplyDeleteవాక్ స్వాతంత్ర్యం మా హక్కు. పునఃస్వాగతం _/\_
'పని లేక.. ' నాక్కూడా ఇష్టమే. I enjoyed a lot writing the blog.
Deleteకొన్నాళ్ళుగా తెలుగు బ్లాగుల్లో వెక్కిరింత, హేళన.. విసుగేసింది. చివర చివర్లో బెదిరింపులు.. భయమేసింది (నా వివరాలు అందరికీ తెలుసు).
ఎగ్రిగేటర్స్ నుండి బ్లాగ్‌ని విడుదల చేయించుకోడానికి ప్రయత్నించాను (ఒక్క కూడలి వారు మాత్రమే నా మొర ఆలకించారు).
ఇక ఇప్పుడు వేరే మార్గం లేక.. కొత్త అకౌంట్‌తో, కొత్త పేరుతో ఈ బ్లాగ్ మొదలెట్టాను (you will not see this blog in Telugu aggregators)
So, this is the story of my new blog
బ్లాగ్‌కి ఈ పేరు ఎందుకు తీసుకున్నానో ముందు పోస్టులో చెప్పాను.
ఇంక template అంటారా! రాసే ఓపికే వుండాలి గాని మిగిలినవి అంత ముఖ్యం కాదనుకుంటాను.
రమణగారూ,
Deleteతెలుగుబ్లాగుల తీరుతెన్నులపట్ల ఆందోళన చెందుతున్నవారిలో నేనొకడిని. హెచ్చుశాతం బ్లాగులు చచ్చుపుచ్చుసరుకునే చదువరులపైన విసురుతున్నాయి. Russel అన్నట్లు Book of All Time స్థాయిలో తమరచన ఉండాలనీ తదనుగుణంగా తమరచనలలోని విషయమూ భాషా శైలీ అనే మూడున్నూ ఉండాలనీ ఆశించి వ్రాయటానికి ఆట్టేమంది ఆలోచించటం లేదు. అభిప్రాయాలను వెదజల్లటం లేదా రుద్దటం అనే ప్రచారకళాత్మకమైన వినోదంగా మాత్రమే బ్లాగులూ వాటిలో వ్యాఖ్యలూ ములిగితేలుతూ ఉండటం వలన తెలుగుబ్లాగుల గురించి తెలుగువాళ్ళు గర్వంగా చెప్పుకోవటానికి ఆట్టే కనిపించని పరిస్థితి నిజంగా ఒక దుస్థితి. సాహిత్యంలో ఔదాత్యం లుప్తమైతే అది నిస్ప్రాణమైన శరీరమే. బాగుల్లో సాహిత్యం ఎందుకుండాలీ అన్న ప్రశ్నకు జవాబు సులభమే - హితంతో కూడినది సాహిత్యం అని విగ్రహవాక్యం ఆ సాహిత్యం అనే మాటకు - కాబట్టి (సమాజానికి) హితం కూర్చని/కూర్చలేని సరకుని బ్లాగుల్లో నింపటం అనారోగ్యవ్యాప్తి మాత్రమే. కాస్త విలువలతో కూడిన వ్రాయసకాళ్ళను విలువలు తెలియని లేదా వాటిగురించి పట్టింపులేని జనం వేధించటం లోకసాధారణమైన పామరత్వం. అందుకే వ్రాసేవారికి నిబ్బరం తప్పదు. కాబట్టే నా నృషిః కురుతే కావ్యం అన్నారు. మీరు అందంగా వ్రాస్తున్నారు. విషయాలపైన అవగాహనతో వ్రాస్తున్నారు (- మరికొందరి అవగాహనలు వేరుగా ఉండటం వల్ల వాళ్ళల్లో కొందరు మీకు అవగాహన లేదని అనటం ఒక కువాదం.). చదివించగల గుణం గల రచనాశక్తి భగవద్దత్తం. దానిని సద్వినియోగం చేస్తున్నారు. వ్రాయటం మానకండి. వీలైతే మీ బ్లాగు రచనలను క్రోడికరించి కొన్ని ఈ-పుస్తకాలు వేయండి. శుభం భవతు.
రమణగారు జిందాబాద్
ReplyDeleteతెలుగుబ్లాగులు జిందాబాద్
మీ స్థానం మీకు పదిలంగానే ఉంది.
శ్యామలీయం గారూ! కమెంట్ రాసినందుకు ధన్యవాదాలు.
DeleteThank you for the nice words sir!
ReplyDeleteభలే భలే !
బ్లాహే బ్లాహే పిపీలికః ఫన్ లేకః !!
వెల్కం డాక్టరు బాబు గారు :)
అండ పిండ బ్రహ్మాండ ములందు ఎందు చూసినను పిపీలికం ఆశీత్ :)
చీర్స్
జిలేబి
"'గంటలకొద్దీ వాదించినందున అలసిపొయ్యి కళ్ళు తిరిగి పడ్డాడా? లేక చనిపొయ్యాడా?' అన్నది నాకు అర్ధం కాలేదు"
ReplyDeleteభలే వారండీ మీరు! ఇంత గొప్ప సినిమాలో అంతకంటే గొప్పగా నటించినా ఫైటింగ్ లేదన్న ఒకే ఒక కారణంతో ప్రేక్షకులకు చప్పగా అనిపిస్తుందన్న బెంగతోనే ఆయన సొమ్మసిల్లి పడిపోయారు :)
ఆ రోజుల్లో కుఱ్ఱవాళ్ళకు అట్టకత్తి యుధ్ధాలే సినిమాల్లో ముఖ్యాతిముఖ్య ఘట్టాలండీ. మాచిన్నప్పుడు మేము కొత్తపేట (తూ.గో)లో ఉండేవాళ్ళం. ఒకసారి, 'రేచుక్క పగటిచుక్క' అన్న జానపద చిత్రం ఆడుతోంది (అప్పటికి) అక్కడున్న ఒకే ఒక సినిమా హాలు మారుతీటాకీసులో అని నేనూ మాతమ్ముడూ బెంచీ టిక్కట్టుకొని వెళ్ళాం లోపలికి. కాని తీరా చూద్ధుము కదా, అప్పటికే ఆట మొదలై, తెరమీద, ఎవరో ముగ్గురు చిన్నిచిన్న అమ్మాయిలు ట్రైసికిళ్ళు తొక్కుతున్నారొక విశాలమైన హాల్లో. ఇదేంట్రా బాబూ జానపదాల్లో ఇలాంటివి సరుకులు ఉండవే అని దిగాలు పడిపోయాం. ఇంతకీ అదొక సాంఘికచిత్రం! (సిరిసంపదలు అట తరువాత తెలిసింది.) నాకు నిరుత్సాహం. మా తమ్ముడికైతే ఏడుపొకటే తక్కువ! టిక్కట్టు పెట్టి వచ్చాం కదా, చిరాకు పడుతూనే పూర్తిగా చూసాం. చివరికి ఇంటికితిరిగి వస్తూ మా తమ్ముడు అన్నమాట, "ముష్టి సినిమా. ఎప్పుడు చూసినా అందరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు!" అని. లేకపోతే ఫైటింగులు లేని సిసిమా కూడా ఒక సినిమా యేనా? ఆ తరువాత కూడా హాలుదాకా వచ్చి సాంఘికచిత్రం అని పోష్టరు ముఖం చూసి, మా ముఖాలు ముడుచుకొని ఇంటికి తిరిగిపోయిన సంఘటనలూ కొన్ని జరిగాయి లెండి. ఏమో మరి ఆ రోజులే బాగుండేవి ఆ సినిమాలే బాగుండేవి అన్నా తప్పులేదు.
Deleteఎప్పుడు చూసినా అందరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు :)
Deleteఆ సినిమా(compulsion) ఒక సంఘటన (leopold and lobe) ద్వార స్పూర్తి పొంది తీసిందేనండి
ReplyDelete