Wednesday, June 24, 2015

నా కొత్త బ్లాగ్ - పిపీలికం

'పని లేక.. ' బ్లాగ్ మూతబడింది. ఇది బొత్తిగా పాతబడ్డ వార్త.

ఇవ్వాల్టినుండి 'పిపీలికం' అనే కొత్త బ్లాగ్ మొదలెడుతున్నాను. ఇది మాత్రం తాజావార్త!

నాకు దేవుడి మీద నమ్మకం లేదు. కానీ - దేవుడుకి కళ్ళజోడు పెట్టి, ప్యాంటూ చొక్కా తొడిగితే అచ్చు రావిశాస్త్రిలానే వుంటాడనే నమ్మకం మాత్రం వుంది. అట్టి దేవుడు కాని దేవుడు రాసిన 'పిపీలికం' అనే కథ పేరుని నా కొత్త బ్లాగుకి వాడుకుంటున్నాను. ఇందుకు నాకు చాలా సంతోషంగా వుంది.

నా మూతబడ్డ స్థావరం 'పని లేక.. ' అలాగే వుంటుంది. ఎవరైనా ఎప్పుడైనా yaramana.blogspot.in కి వెళ్లి చక్కగా చదూకోవచ్చు. అయితే - కామెంట్లు చేసే సౌలభ్యం మాత్రం లేదు, గమనించగలరు.

బ్లాగైతే మొదలెడుతున్నాను గానీ - ఏం రాయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. ఒక బ్లాగుంటూ వుంటే ఏదోటి రాద్దామనే ఆసక్తి కలగొచ్చు. 'ప్రశాంతంగా పేషంట్లని చూసుకుని హాయిగా తిని పడుకోక - ఈ రాసే పని నాకెందుకు?' అనే సందేహమూ వుంది.

ఈ ఆలోచనలతో కొత్త బ్లాగ్ మొదలెడుతున్నాను, వుంటాను.

(picture courtesy : Google)

16 comments:

  1. Welcome back.

    మీ టపాల సంగతి ఎలా ఉన్నా, ప్రస్తుతం కొంత మంది తెలుగు బ్లాగర్లకి మీ మానసిక వైద్యం అవసరం ఎంతైనా ఉంది.

    ReplyDelete
    Replies
    1. అమ్మో! తెలుగు బ్లాగులా!! ఆ పేరెత్తితేనే భయంగా వుంది. :)

      Delete
  2. Congratulations on your new blog! I hope this blog will be much more interesting!

    ReplyDelete
  3. కొత్తబ్లాగుకు స్వాగతం

    ReplyDelete
  4. I wish you happy and peaceful blogging.
    మీ ఈ కొత్త బ్లాగుని ఏ సంకలినికీ అనుసంధానం చేసినట్లు లేదే?

    ReplyDelete
    Replies
    1. Thank you.

      అక్కణ్నుండి పారిపొయ్యే ఇక్కడికొచ్చాను గదా! :)

      Delete
  5. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
    Replies
    1. అయ్యా! మీ హింస తట్టుకోలేకే నేను కొత్త బ్లాగ్ పెట్టుకున్నాను. రామేశ్వరం పోయినా శనీశ్వరం పోనట్లు ఇక్కడిక్కూడా రావాలా!?

      ఇంకెప్పుడూ నా బ్లాగులోకి రావద్దు, కామెంట్ రాయొద్దు.

      జస్ట్ గెటౌటాఫ్ మై ప్లేస్!

      Delete
  6. మీ కొత్త బ్లాగుకు స్వాగతం!

    ReplyDelete
  7. మీరు మీ బ్లాగ్ తో మళ్ళీ కనిపించినందుకు చాలా సంతోషం...
    బ్లాగ్ పేరు ఏదైనా పోస్ట్ మీది అయితే చాలు !

    ReplyDelete
  8. రమణ గారూ, మీ బ్లాగ్ మళ్లీ ఇన్నాళ్ళకి చదవగలిగానండి. పాత బ్లాగ్ అడ్రస్ మర్చిపోయాను. మళ్లీ ఇన్నాళ్ళకు. ఎప్పుడు కామెంట్ అయితే చెయ్యలేదు గాని ఇప్పుడు మీ బ్లాగ్ మళ్లీ కనిపెత్తగాలిగాను అనే ఆనందం లో కామెంట్ పెడుతున్నాను. మంచి మంచి చలోక్తులతో నిండిన బ్లాగ్ పోస్ట్ లు రావాలని ఆశిస్తున్నాను.

    ReplyDelete

Comments will be moderated, may take sometime to appear.